Skip to main content
నిత్యం నరకయాతన పడుతున్న ప్రయాణికులు పలివెల బాట.. గుంతల కోట
సత్య కవచం న్యూస్, పలివెల:
పలివెల నుండి మునుగోడు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి అధ్వాన స్థితికి చేరింది. రోడ్డు పైపొర లేచిపోయి కంకర తేలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు గుంతలను తప్పించే క్రమంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి, తక్షణమే మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారంగా నూతన బీటీ రోడ్డును నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Popular posts from this blog
Comments
Post a Comment